ఆ నోట్ల రద్దు ఉత్త ప్రచారమే: ఆర్బీఐ

న్యూఢిల్లీ: గత రెండు మూడు రోజుల నుంచి త్వరలోనే పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను దేశంలో రద్దు చేస్తారన్న న్యూస్ మీడియాలో హల్చల్ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు, వార్తా పత్రికలు, టీవీల్లోనూ ఈ ప్రచారం హోరెత్తింతి. దీంతో దేశంలోని సామాన్యుల నుండి అన్ని వర్గాల ప్రజల్లో నోట్ల ఉపసంహరణపై తీవ్ర చర్చ చోటుచేసుకుంది. చివరకు ఈ ప్రచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టికి వెళ్లడంతో.. అదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను సమీప భవిష్యత్తులో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్‌న్యూస్‌ను ప్రజలు నమ్మవద్దని కోరింది.