ఆ 8 రాష్ట్రాల్లో ల‌క్ష దాటిన యాక్టివ్ కేసులు: కేంద్రం

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిచెందుతుంద‌ని తెలిపారు. ఇప్పుడు ఆ 8 రాష్ట్రాల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటేసింద‌ని పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 14.19 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్‌ల పంపిణీ పూర్తిచేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ వెల్ల‌డించింది. ఆక్సిజ‌న్ కొర‌తను అధిగ‌మించేందుకు ఇత‌ర దేశాల నుంచి ఆక్సిజ‌న్ తెప్పిస్తున్నామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.