ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: న‌గ‌రంలోని బండ్ల‌గూడ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. స్థానిక‌ ద్వారకానగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని ఉదయం ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి బయటకు రాలేదు. ఎంత‌సేప‌టికి బ‌య‌టికి రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన త‌ల్లిదండ్రులు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.