ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఫిబ్ర‌వరి 11

హైద‌రాబాద్: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఫిబ్ర‌వ‌రి 11 వరకు తుదిగడువు విధించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ మేర‌కు శ‌నివారం బోర్డు ప్ర‌క‌టించింది. కాగా ఫిబ్ర‌వ‌రి 22 వర‌కు రూ. 100 ఆల‌స్య రుసుంతో, రూ. 500 ఆల‌స్య రుసుంతో మార్చి 2వ తేదీ వ‌ర‌కు, రూ.1000 ఆల‌స్య రుసుముతో మార్చి 9 వ‌ర‌కు, అదే రూ. 2 వేల ఆల‌స్య రుసుముతో మార్చి 16వ తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లింపు గ‌డువును పెంచింది. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.