ఇండియా వ్యాక్సినే కావాలన్న నేపాల్
ఖాట్మాండు: కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌కు నేపాల్ నో చెప్పింది. ఇండియాలో తయారయ్యే వ్యాక్సిన్‌లే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నెల 14న ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ప్రదీప్ సమావేశం కానున్నారు. ఇందులోనే నేపాల్‌కు కోటీ 20 లక్షల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిందిగా ప్రదీప్ కోరనున్నారు.