ఇక స్వ‌చ్ఛ సిద్దిపేటే ల‌క్ష్యం: ఆర్థిక మంత్రి మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొని సిద్దిపేట మున్సిపాలిటీని మొదటి వరుసలో నిలుపుదామని ప్రజలకు ఆర్థిక‌ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన 2కే ర‌న్‌లో హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, పట్టణ వాసులు, పట్టణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంత‌రం స్వ‌చ్ఛ సిద్దిపేట సాధించే ల‌క్ష్యంతో కృషి చేస్తాననే ప్ర‌తిజ్ఞ‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ.. బోర్డుపై మంత్రి సంత‌కం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ర‌న్ ఫ‌ర్ స్వ‌చ్ఛ సిద్దిపేట కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ట్ట‌ణ యువ‌త‌, సిటిజెన్స్ పాల్గొన‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌తి పౌరుడు స్వ‌చ్ఛ సిద్దిపేట‌కై బాధ్యాత‌యుతంగా ముందుకు రావాల‌ని కోరారు. స్వ‌చ్ఛ సిద్దిపేట కోసం స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఇవాళ 2కే ర‌న్ నిర్వ‌హించి స్వ‌చ్ఛ స్ఫూర్తిని చాటారు.. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొన‌సాగించాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.