ఇద్దరు కలెక్టర్లు బదిలీ..

హైదరాబాద్: గవర్నర్ ఆదేశాల మేరకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ బదిలీ అయ్యారు. కుమ్రం భీ జిల్లా కలెక్టర్‌గా 2015 -బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్‌ను నియమించారు. ఈ ప్రస్తుతం రాహుల్‌రాజ్ జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ స్థానంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.