ఇరాన్ అణు శాస్త్రవేత్త హత్య!

టెహ్రాన్: ఇరాన్ దేశానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త మోషెన్ ఫక్రిజాదే టెహ్రాన్ వద్ద జరిగిన దాడిలో హత్యకు గురయ్యారు. నగర శివారు ప్రాంతమైన అబ్‌సార్డ్ వద్ద వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అణుశాస్త్రవేత్త హాస్పిటల్‌లో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు. అణు శాస్త్రవేత్త హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్తలను వరుసగా గత పదేళ్ల నుంచి హతమారుస్తున్నట్లు ఇజ్రాయిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. సీనియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది.