ఇళ్ల పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
అమరావతి: ఇళ్ల పథకంపై ఏపీ ప్రభుత్వం గురువారం అనుమతులు జారీ చేసింది. 28 లక్షల 30 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.తొలి విడతగా 15. 10 లక్షల ఇళ్లు, రెండో విడతలో 13.10 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టనుంది.
ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 24, 776 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రతి ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.రివర్స్ టెండర్ల ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు నిర్మాణ సంస్థను ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఇళ్లకు నీటి సరఫరా కోసం ప్రభుత్వం రూ. 920 కోట్లను కేటాయించింది. డిసెంబర్ 25 నుండి ప్రతి రోజూ లక్ష ఇళ్లకు శంకుస్థాపన చేయనుంది.గ్రామీణ నీటి సరఫరా, మున్సిఫల్ శాఖల ద్వారా నిధులు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వైసీపీ చెబుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.