ఉగాది నుంచి వ‌రంగ‌ల్‌లో రోజూ తాగునీటి స‌ర‌ఫ‌రా: మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఇవాళ (సోమ‌వారం) ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయ‌ర్‌, మున్సిప‌ల్ శాఖ‌, ఆర్థిక శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఉగాది నుంచి వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో రోజూ తాగునీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర పురోగ‌తికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రింత వేగంగా వ‌రంగ‌ల్ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లాల‌ని కేటీఆర్ సూచించారు. అలాగే కార్పొరేష‌న్ ప‌రిధిలో నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పురోగ‌తిపై కేటీఆర్ స‌మీక్షించారు.

 

Leave A Reply

Your email address will not be published.