ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. డయాగ్నోస్టిక్ హబ్‌లోని వైద్య పరికరాలు, 57 రకాల వైద్య పరీక్షల గురించి వైద్యాధికారులు మంత్రికి వివరించారు.