ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు, సిని తారలు కరోనా బారిన పడ్డారు.
తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.