ఉదయం నుంచి ఇళ్లను పరిశీలించా: భట్టి

హైదరాబాద్: కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గురువారం పరిశీలించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లెక్కలపై కాంగ్రెస్, అధికార టీఆర్‌ఎస్ నేత మధ్య శాసనసభలో నిన్న వాడీవేడీ చర్చ నడిచింది. ప్రభుత్వం కట్టిన ఇళ్లను చూపెట్టాలని భట్టి విసిరిన సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు. ఈ నేపథ్యంలో గురువారం ఇవాళ్ల జియాగూడ, గోడే ఖబర్, అంబేడ్కర్ నగర్‌లో ఇళ్లను పరిశీలించిన వారిద్దరూ… కట్టెలమండి, సీసీనగర్, కొల్లూరులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 3,428 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పరిశీలించాం. ఉదయం నుంచి ఇళ్లను పరిశీలిస్తున్నాం. 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. ఇవాళ నాలుగు చోట్ల తిరిగాం. రేపు ఎల్లుండి ఇళ్లను పరిశీలిస్తాం. మంత్రి తలసాని, మేయర్‌తో కలిసి ఇళ్లను పరిశీలించాం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల క్వాలిటీపై ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం ఇళ్లు చూశాక నా నిర్ణయం ప్రకటిస్తా. రాజీవ్ గృహకల్ప ఇళ్లు కట్టించి చాలా ఏళ్లయింది. వాటికి వీటికి తేడా చూడాలి’ అన్నారు. కాగా మంత్రి తలసాని ఈరోజు (గురువారం) ఉదయం నేరుగా భట్టి ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలనకు తీసుకెళ్లారు.