ఉపరితల ద్రోణి ఎఫెక్ట్: రాష్ర్టంలో చలిగాలులు

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ర్టంలో చలిగాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉదయం సాయంత్రం చలి తీవ్రత పెరగనున్నట్లు తెలిపారు. కాగా గత రెండు రోజుల కింద ఈశాన్య బీహార్ నుంచి ఆగ్నేయ అరేబియన్ సముద్రం వరకు విస్తరించి ఉన్న పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) అత్యల్పంగా 13.3 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్‌లో అత్యధికంగా 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉదయం అక్కడక్కడ తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.