ఉలిక్కిప‌డిన దండ‌కార‌ణ్యం..

బీజాపూర్ ఎన్‌కౌంట‌ర్లో ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది జ‌వాన్ల మృతి

 

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌లోని బీజాపూర్ జిల్లాలో శ‌నివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంట‌ర్‌లో అసువులుబాసిన జ‌వాన్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది జ‌వాన్లు మృతి చెందిన‌ట్లు స‌మాచారం.. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా 19 మంది మృత‌దేహాల‌ను గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దుల్లోని అట‌వీ ప్రాంతంలో మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. మ‌రో 43 మంది జవాన్లు స్వ‌ల్ప గాయాలతో బయటపడగా, ఇంకో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. గాయ‌ప‌డిన వారిని బీజాపూర్‌, రాయ్‌పూర్ ఆస్ప‌త్రుల్లో చికిత్సఅందిస్తున్నారు. భ‌‌ద్ర‌తాబ‌ల‌గాలు, మావోయిస్టుల మ‌ధ్య భీక‌రపోరుతో ఛత్తీస్‌గఢ్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న‌ది.

ఈ దాడిలో మావోయిస్టులు మోటార్ లాంచ‌ర్‌ల‌ను కూడా వినియోగించిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొన‌సాగుతున్నాయి. దాంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవకాశం ఉన్న‌ది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెల్ల‌డికావాల్సి ఉంది.
కాగా ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళి అర్పించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ సిఎం భూపేష్ బ‌ఘెల్‌కు అమిత్‌షా ఫోన్ చేసి ప‌రిస్థితిపై ఆరా తీశారు.

Leave A Reply

Your email address will not be published.