ఎండీహెచ్ మసాల సంస్థల అధినేత కన్నుమూత

హైదరాబాద్ : భారత ప్రఖ్యాత మసాలా(స్పైసెస్) బ్రాండ్ మహాషియాన్ ది హట్టి(ఎండీహెచ్) అధినేత మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి(98) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
1923లో పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించారు. ధరంపాల్ గులాటి తండ్రి సియోల్‌కోట్‌లో మసాలాల వ్యాపారం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ఆయన ఢిల్లీలోని కరోల్‌భాగ్‌లో ఓ షాప్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి మహాషై ధరంపాల్ గులాటి దేశంలోనే ప్రముఖ కంపెనీగా ఎండీహెచ్‌ను తీర్చిదిద్దారు.