ఎంపిలో కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ?

భోపాల్: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ఆ రాష్ట్ర సిఎం పలు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. గడిచిన రెండు రోజుల్లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. సరిహద్దు జిల్లాల ప్రజలు మహారాష్ట్రకు వెళ్లొద్దని సిఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను తిరిగి అమలు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా కరోనాను ఎదుర్కొనేందుకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.