ఎంపిలో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్‌

భోపాల్‌: దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే క‌రోనా క‌ట్టడికి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గురువారం ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌రకు ఈ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. పెద్ద న‌గ‌రాల్లో మ‌రోసారి కంటైన్మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా గ‌త 24 గంట‌ల్లోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 4 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో మొత్తం 3.18 ల‌క్షల మంది క‌రోనా బారిన ప‌డ్డారు.

Leave A Reply

Your email address will not be published.