ఎంపి సంతోష్ కుమార్‌కు క‌రోనా

హైద‌రాబాద్  (CLIC2NEWS) :  రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే త‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీ నాయకులు తనకు ఫోన్లు చేస్తున్నారని చెప్పారు సంతోష్ కుమార్. ప్రస్తుతం తాను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. తనను ఈ మధ్య కలిసిన నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఒక వేళ బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే ద‌య‌చేసి త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఎంపీ సంతోష్ కుమార్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.