18 ఏళ్లు పైబడిన వారికి 24వ తేదీ నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ (clic2news): మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు. ఈ రిజిస్ట్రేషన్ CoWin యాప్ ద్వారానే చేసుకోవాలని సూచించారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.