ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం

గుంటూరు : పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకష్ణన్ వేధింపుల వల్లే ఎస్‌ఐ గీత ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. దీంతో సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు.