ఎన్నికల బరిలో 9 నెలల గర్భవతి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం

9 నెలల గర్భంతో.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం
కలిదిండి: కృష్ణా జిల్లాలో రెండో విడుత పంచాయతీ పోరులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 9 నెలల గర్భిణీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగింది. కాగా పోలింగ్ రోజున ఓటు వేసి అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన జిల్లా లోని కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచి స్థానం మహిళకు రిజర్వు కావడంతో బట్టు లీలాకనకదుర్గ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది.
వివరాల్లోకి వెళ్లే.. 9నెలల గర్భంతో ఎన్నికల ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంది. ఓటు వేసిన కొద్ది సేపటి తర్వాత ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కైకలూరు ప్రభుత్వాసుత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. సర్పంచిగా పోటీచేసి ఓటు వేసిన రోజే బిడ్డ పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని లీలా కకనదుర్గ వెల్లడించింది