ఎపిలో కొత్తగా 246 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజాగా వైరస్ బారినపడిన వారిలో 131 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986కు చేరింది. 8,83,890 చికిత్సకు కోలుకున్నారు. మరో 1909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఇవాళ్టి వరకు 7187 మంది మృత్యువాతపడ్డారని అధికారులు పేర్కొన్నారు.