ఎపిలో కొత్త‌గా 1,085 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్ లో గ‌డిచిన 24 గంట‌ల్లో 65,101 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,085 మందికి కరోనా నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 863843 కి చేరింది. అందులో 843863 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 13024 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6956కి చేరింది. అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 10, చిత్తూరు 142, తూర్పుగోదావరి జిల్లాలో 116, గుంటూరు 126, కడపలో 57, కృష్ణాలో 224, కర్నూలులో 31, నెల్లూరు 50, ప్రకాశంలో 42, శ్రీకాకుళంలో 26, విశాఖపట్నంలో 86, విజయనగరంలో 37, పశ్చిమ గోదావరిలో 138 కేసులు నమోదయ్యాయి.

 

Leave A Reply

Your email address will not be published.