ఎపిలో కొత్తగా 118 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజాగా మరో 89 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 7,176 మంది మృతి చెందారు. మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,884కు చేరింది. అలాగే రాష్ట్రంలో 8,82,670 మంది కరోనా చికిత్సకు కోలుకున్నారు. ప్రస్తుతం మరో 1,038 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.