ఎపిలో కొత్త‌గా 2,558 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,15,832 కు చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 915 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా డిశ్చార్జిల‌తో కాల‌పి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 8,93,651 మంది కోలుకొకున్నారు. ప్ర‌స్తుతం 14,913 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 7,268 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.