ఎపిలో కొత్తగా 298 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 298 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 891861కు చేరింది. కాగా కొత్తగా నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మృతిచెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 7184కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1400 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.
