ఎపిలో కొత్త‌గా 380 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 380 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఈ మ‌ధ్య కాలంలో రాష్ట్రంలో ఇంత భారీగా కేసులు న‌మోదు కావ‌డం ఇవాళే.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,978 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ‌హించారు. అలాగే రాష్ట్రంలో కరోనాతో కొత్త‌గా ఇద్దరు మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్పటి వరకు కరోనాతో 7189 మంది మృతిచెందారు. కొత్త‌గా 204 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ర‌మోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 893366కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884094 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2083 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.