ఎపిలో కొత్త‌గా 41 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 41 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 889339కు చేరింది. వీటిలో ప్రస్తుతం 590 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే తాజాగా గ‌త 24 గంట‌ల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7167కు చేరింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 881582 మంది కరోనా నుంచి కోలుకున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.