ఎపిలో కొత్తగా 5,210 కోవిడ్ కేసులు
అమరావతి: ఏపిలో కరోనా ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. శనివారం ఒక్కరోజు 75,517 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,210 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 7,55,727కు చేరుకుంది. కోవిడ్ బాధితుల్లో కొత్తగా 5509 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,03,208. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 46,295 . వైరస్ బాధితుల్లో కొత్తగా 30 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 6224 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల వ్యవధితో కోవిడ్ కారణంగా 30 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో నలుగురు, గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గేరి చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. అనంతపురం, కృష్ణా జిల్లాలో ఇద్దేరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 6,224కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 5509 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 65,69,616 మందికి కరోనా సాంపిల్స్ పరీక్షించారు.