ఎపిలో కొత్తగా 88 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 88 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే తాజాగా వైరస్ బారినపడి వారిలో 72 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 8,89,298 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వారిలో 8,81,511 మంది చికిత్సకు కోలుకున్నారు. ప్రస్తుతం 620 మంది చికిత్స పొందుతున్నారు. కాగా కొవిడ్‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,167 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 31,680 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.