ఎపిలో కొత్తగా 94 కరోనా కేసులు

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంతో తాజాకేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకు 8,89,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగావైరస్ బారినపడి వారిలో చికిత్సకు కోలుకొని 66 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,81,732 మంది చికిత్సకు కోలుకున్నారు. ప్రస్తుతం 603 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7168 మంది మృతిచెందారని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.