ఎపిలో 4 వేలు దాటిన క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఎపిలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,483 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 8,99,721 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 25,850 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,321 మంది మృతి చెందారని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.