ఎపిలో 48 గంటల్లో తేలికపాటి వర్షాలు

విశాఖ: ఆంధ్రప్రదేశ్లో రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని రెండు మూడు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో తక్కువ ఎత్తులో తూర్పు, ఈశాన్యగాలులు వీస్తున్నందున పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.