ఎపి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి వద్ద కాన్వాయ్‌లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో తమ్మినేనికి ప్రమాదం తప్పింది. శనివారం మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో క్షేమంగా తిరిగి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.