ఎపి కొవిడ్ అంబులెన్స్‌లు అడ్డగింత!
సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఎపి నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కొవిడ్ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు కర్నూలు జల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లను నిలిపివేస్తున్నారు. అయితే సాధారణ ప్రయాణికులను మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు