ఎపి: పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్ర‌క‌టించిన స‌ర్కార్‌

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ స‌ర్కార్  శుభ‌వార్త చెప్పింది. విధుల్లో ఉత్తమ పనితీరు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఉగాది సందర్బంగా ఏపీ ప్రబుత్వం ఉగాది ప్రసకరాలు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2020, 2021 ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాలను సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ విడుదల చేశారు. ముఖ్య‌మంత్రి జగన్ ఈ పురస్కారాలను పోలీస్ లకు అందజేయనున్నారు. ఇందులో భాగంగానే ఈ ఉగాది పర్వదినం వేళ 583 మందికి పతకాలు ప్రకటించింది. ఏపీ పోలీస్, ఫైర్ సర్వీసెస్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.