ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేత‌న్ ‌ప‌టేల్‌

హైద‌రాబాద్‌: భార్య పాల‌క్‌ను హ‌త్య చేసిన కేసులో భార‌త్‌కు చెందిన భ‌ద్రేశ్‌కుమార్ చేత‌న్‌భాయ్ పటేల్ అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ప‌రారీలో ఉన్న చేత‌న్‌భాయ్ ప‌టేల్‌పై ల‌క్ష డాల‌ర్ల రివార్డు ఉన్న‌ది. 2017 నుంచి ఎఫ్‌బీఐ జాబితాలోని ప‌ది మంది మోస్ట్ వాంటెడ్ జాబితాలో అత‌ను ఉన్నాడు. తాజాగా శుక్ర‌వారం రోజున మ‌ళ్లీ ఎఫ్‌బీఐ ఆ కేసుకు సంబంధించిన ట్వీట్ చేసింది.

2015లో భార్య‌ను చంపిన అత‌ను అప్ప‌టి నుంచి పరారీలో ఉన్నాడు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని హ‌నోవ‌ర్‌లో ఉన్న ఓ డూన‌ట్ కాఫీ షాపులో ప‌నిచేస్తున్న భార్య పాల‌క్‌ను ప‌టేల్ క‌త్తితో దాడి చేసి హ‌త‌మార్చాడు.

తాజాగా ఎఫ్‌బీఐ ఆ కేసుకు సంబంధించిన ట్వీట్ చేసింది. ప‌టేల్ రివార్డు ఆఫ‌ర్ గురించి తాజా పోస్టులో వివ‌రించింది. అత‌ని స‌మాచారం తెలిస్తే త‌మ ఏజెన్సీని కానీ, కాన్సులేట్‌ను కానీ సంప్ర‌దించాలంటూ ఎఫ్‌బీఐ పేర్కొన్న‌ది. అమెరికాలోని అత‌ను కొంద‌రి వ‌ద్ద త‌ల‌దాచుకుంటున్న‌ట్లు ఎఫ్‌బీఐ అనుమానాలు వ్య‌క్తం చేసింది. వీసా విష‌యంలో భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డిన ప‌టేల్‌.. ఆమెను హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పటేల్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి అని ఎఫ్‌బీఐ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది.

 

Leave A Reply

Your email address will not be published.