ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మక్కల కొనుగోలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ట్రేడర్ల కొనుగోలు తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, మద్దతు ధర కల్పించి నష్టపోకుండా చూడాలని సూచించారు.
