ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్ అరెస్టు!

కడప: ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్‌ని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైజాక్ గ్యాంగ్ వెంబడించేలా చేసి ఐదుగురు తమిళ కూలీల సజీవ దహనానికి కారకుడైన బడా స్మగ్లర్‌ను.. బెంగళూరు వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కర్ణాటక రాజధానిలో మకాం వేసి చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తోన్న బాషాభాయ్‌ను ప్రశ్నిస్తే స్మగ్లింగ్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటపడే చాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సోమవారం తెల్లవారుజామున.. వల్లూరు మండలం గోటూరు వద్ద రెండు కార్లు, టిప్పర్ ఢీకొని మంటలు చెలరేగిన ఘటనలో ఐదుగురు తమిళ కూలీలు సజీవదహనమయ్యారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. అంతర్జాతీయ స్మగ్లర్ బాషాభాయ్ హస్తం వెలుగుచూసింది. కడప జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్‌లో ముగ్గురూ మంగళవారమే అరెస్టుకాగా బాషాభాయ్ కోసంఎస్పీ ఐదు స్పెషల్ టీమ్స్ నియమించారు. బెంగళూరు వెళ్లిన పోలీసులు… కాల్‌డేటా ఆధారంగా బాషాభాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.