ఎస్సెస్సీ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమశాఖ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నది. ఫిబ్రవరి ఒకటి నుంచి 60 రోజులపాటు శిక్షణ సాగనున్నది. ప్రతి శిక్షణ కేంద్రంలో ఎస్టీలకు 72, ఎస్సీలకు 15, బీసీలకు 10, వికలాంగులకు మూడు సీట్ల చొప్పున కేటాయించనున్నారు. ఇందులో 1/3 నిష్పత్తిలో 33 సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు జనవరి ఐదు నుంచి 20వ తేదీలోపు http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 040–27540104 నంబర్‌లో సంప్రదించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పేర్కొన్నది.