ఎస్.వి.రమణాచారి: అమ్మకు దండం పెడతా..

అమ్మకు దండం పెడతా…
దేవతలంతా ఒకవైపు
అమ్మ ఒక వైపు
నేను ఒరిగేను అమ్మవైపు
అన్నది నగ్న సత్యం
ప్రతీ రోజు ఉదయం లేస్తూనే
అమ్మను తలుచుకుంటూ
మాతృదేవో భవ అనుకోవటం
మన సంస్కృతి,ఆచారం
ఏదో ఒకరోజు అనుకుంటే సరిపోదు
నవమాసాలు మోసి..
తానూ మరణయాతన పడుతూ
తల్లి బిడ్డకు జన్మనిస్తుంది..
తాను తిన్నా తినక పోయినా
నిరంతరం బిడ్డల క్షేమం కోరుతుంది
అందుకే మాతృత్వంలోనే ఉంది
ఆడజన్మసార్ధకం..
అమ్మా అనిపించుకొనుట
స్త్రీ మూర్తికి గౌరవం…
ఈ ఆధునిక కాలంలో..
తల్లిదండ్రులను ప్రేమతో
చూసుకోవడం సన్నగిల్లుతుంది
వారిని నిర్లక్ష్యం చేస్తూ
అందమైన మన బతుకుల కోసం
వారిని వృద్దాశ్రమాలలో చేర్చుతున్నాం
వారికి కావాల్సింది తిండి మాత్రమే..
అనుకుంటూ వారిని వదిలి పెట్టి
దూర తీరాలకు వెల్లుతున్నవారు ఎందరో ఎందరెందరో…
ఈ సమయంలో అలాంటి వృద్ధ తల్లులు
పడే బాధను వర్ణించ లేం
ఈ మాతృ దినోత్సవం నుంచియైనా
తల్లినీ,తండ్రిని మరింతగా
గౌరవిద్దాం…నిరంతరం
వారి యోగక్షేమాలు..
వారి సలహాలు పాటిస్తూ
మన భారతీయ సంస్కృతిని
ప్రపంచవ్యాప్తంగా చాటుదాం
అందరికి వందనాలు

-‍‍ఎస్.వి.రమణా చారి
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

Leave A Reply

Your email address will not be published.