ఏడిదలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు..

మండపేట (CLiC2NEWS): కోవిడ్ సోకిన వారి కోసం మండలం లోని ఏడిదలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. నూతనంగా ప్రారంభించ బోయే ఐసోలేషన్ సెంటర్ ను మండల అభివృద్ది అధికారి ఎంపీడీవో అయిదం రాజు సోమవారం పరిశీలించారు. ఐసోలేషన్ కేంద్రంలో కల్పించే సౌకర్యాలను కార్యదర్శి ఉండమట్ల వీర్రాజు ఎంపీడీవో కు వివరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని అన్నారు. కరోనా బారినపడ్డ బాధితులు తమ ఇళ్ళలో ఉండలేని పరిస్ధితులు ఎదురైతే ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించు కోవచ్చు అన్నారు. సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబంలో ఉన్న వారికి వైరస్ సంక్రమిస్తే ఐసోలేషన్ కేంద్రంలో తల దాచుకుంటేనే శ్రేయస్కరం అన్నారు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని అన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వైద్యుల పర్యవేక్షణ కూడా ఉంటుంది అన్నారు. కోవిడ్ బారిన పడ్డ వారంతా ఐసోలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొంత కాలం గ్రామంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించాలి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.