ఏజీపీగా నామాల శ్రీనివాస్..

శుభాకాంక్షలు తెలిపిన బార్ అధ్యక్షులు అబ్బులు నాయుడు..

ఆలమూరు (CLiC2NEWS): ఆలమూరు కోర్టుల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా చింతలూరు కు చెందిన న్యాయవాది నామాల శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిమూలం అబ్బులు నాయుడు ఏజీపీ శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీనివాస్ నియామకం పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు, హై కోర్టు న్యాయవాది టివి గోవిందరావు హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందిస్తూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే ఏజీపీ శ్రీనివాస్ కు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.