ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 147 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,88,004 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,309 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.