ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు

అమరావతి : తాజాగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో నమోదైన గణాంకాలను ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 61,050నమూనాలు పరీక్షించగా 1,392పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,359 కు చేరింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,802కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,549మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 87,25,025మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,235యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.