ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలల్లో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా మరణాలేవి రాష్ట్రంలో సంభవించలేదు. ఈ మేరకు ఆదివారం సాయంత్రి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ 155 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 8,87,010 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,78,387 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,476 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 7,147 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.