ఏపీలో కొత్తగా 2,477 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో 24 గంటల్లో 74,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,477 మందికి కోవిడ్ సోకిన‌ట్లు నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో చికిత్స పొందుతూ 10 మంది మృతి చెందారు.
మొత్తం మరణాల సంఖ్య 6,744కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 2,701 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,05,026 గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 21,438 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 83,42,265 మందికి సాంపిల్స్‌ పరీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.