ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 282 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 442 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,80,712 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,69,920 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,700 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 42,911 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,15,74,117 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.