ఏపీలో కొత్తగా 316 కరోనా కేసులు

అమరావతి: గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 43,006 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 316 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఇదే సమయంలో 595 మంది రికవరీ అయ్యారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,288కు పెరగగా, రికవరీ కేసులు 8,59,624కు పెరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 7,038 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,626గా ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 1,04,53,618కు పెరిగాయి.